కన్నడ నటుడు ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించారు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో హారర్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ఎంవీఆర్ కృష్ణ దక్కించుకున్నారు.
కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ‘ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌ను కలిగిస్తుంది. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నోబిన్ పాల్, దర్శకత్వం: లోహిత్ హెచ్.