Pragathi | చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న నటి ప్రగతి… జీవితంలో ఆ దర్శకుడితో పని చేయకూడదని అనుకున్నా..
Pragathi | టాలీవుడ్ నటి ప్రగతి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తిగత అభిరుచులు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సినిమా రంగంలో పాత్రకు, డబ్బుకు మధ్య తన ప్రాధాన్యతను వివరించిన ఆమె, మంచి పాత్ర లభిస్తే పారితోషికం విషయంలో రాజీ పడేందుకు సిద్ధమని తెలిపారు.
Pragathi | టాలీవుడ్ నటి ప్రగతి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తిగత అభిరుచులు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సినిమా రంగంలో పాత్రకు, డబ్బుకు మధ్య తన ప్రాధాన్యతను వివరించిన ఆమె, మంచి పాత్ర లభిస్తే పారితోషికం విషయంలో రాజీ పడేందుకు సిద్ధమని తెలిపారు. అయితే, కథ లేదా పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద అవకాశం అయినా వదులుకుంటానని ఆమె తేల్చి చెప్పారు. తక్కువ పారితోషికానికి పనిచేయడాన్ని నిరాకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పిన ప్రగతి, ఒక దర్శకుడితో పనిచేసినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ దర్శకుడి పేరు గుర్తులేకపోయినా, షూటింగ్ ప్రారంభమైన రెండో రోజుకే ఆయనతో మళ్లీ పనిచేయకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తన కెరీర్లో అలాంటి అనుభవం ఒక్కసారి మాత్రమే ఎదురైందని తెలిపారు.
చిన్న, పెద్ద సినిమాల మధ్య తేడా గురించి మాట్లాడిన ప్రగతి, నటన అనేది అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ఆధారంగానే చిన్న, పెద్ద సినిమాలుగా విభజన ఉంటుందని, దర్శకుడు లేదా హీరో స్థాయితో సంబంధం లేదని స్పష్టం చేశారు. తన కెరీర్లో 99 శాతం సినిమాలు విడుదలయ్యాయని, పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు చిన్న సినిమాల్లోనూ నటించినా, అవన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చినవేనని చెప్పారు. సినిమాలతో పాటు పవర్ లిఫ్టింగ్‌పై తనకున్న ఆసక్తిని కూడా ప్రగతి వెల్లడించారు.
ఇప్పటికే ఆసియా స్థాయిలో విజయాలు సాధించిన ఆమె, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం తన లక్ష్యమని తెలిపారు. షూటింగ్‌ల మధ్యలో కూడా రోజుకు రెండు నుంచి మూడు గంటలు వర్కవుట్ చేస్తానని, ఫిట్నెస్ తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. 80–90 ఏళ్ల వయసులో కూడా చురుకుగా ఉండాలని ఆశిస్తున్నానని, పవర్ లిఫ్టింగ్ వల్ల తన ఫెమినిటీకి ఎలాంటి భంగం కలగలేదని ప్రగతి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ ఒక మహిళగానే ఉంటానని ధైర్యంగా చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

