Dude Trailer | ‘లవ్ టుడే’ ‘డ్రాగన్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డ్యూడ్(Dude). ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో ప్రేమలు సినిమాతో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మల్లు బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా తమిళంతో పాటు, తెలుగు భాషల్లో అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.