27 ఏండ్ల తర్వాత..
ఒకప్పుడు వెండితెరపై హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా-సిమ్రాన్. వీరిద్దరు కలిసి వీఐపీ, టైమ్ వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరు కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ‘కమల్ శ్రీదేవి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఒకప్పుడు వెండితెరపై హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా-సిమ్రాన్. వీరిద్దరు కలిసి వీఐపీ, టైమ్ వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరు కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ‘కమల్ శ్రీదేవి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణానంద్ కొట్టారపట్టు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌కు చెందిన జియాన్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది.
ఒకప్పుడు తమదైన నృత్యాలు, నటనతో అలరించిన ప్రభుదేవా-సిమ్రాన్ జంట ఈ సినిమాతో మరోమారు ప్రేక్షకుల్ని మెప్పిస్తారని, వినోదప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నారు. ప్రస్తుతం సిమ్రాన్…రజనీకాంత్‌తో కలిసి ‘ధర్మన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

