Salaar | ప్రభాస్ ‘సలార్’ షూట్లో జాయిన్ అయ్యే డేట్ ఫిక్స్..!
ప్రభాస్ (prabhas) సలార్ (Salaar) చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) నిర్మిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం మరో పాన్ ఇండియా చిత్రం సలార్ (Salaar)తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ (prabhas) టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) నిర్మిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ప్రభాస్ సెప్టెంబర్ 4న మళ్లీ షూట్లో జాయిన్ కాబోతున్నాడట.
ఈ నెల చివర వరకు షెడ్యూల్ కొనసాగనుందని వార్తలు వస్తుండగా..దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది సలార్. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే డార్క్ షేడ్స్ బ్యాక్ డ్రాప్ లుక్‌తో అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ (Shruti Haasan) ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్. కేజీఎఫ్ ప్రాంచైజీకి అదిరిపోయే మ్యూజిక్ అందించిన రవిబస్రూర్ సలార్ చిత్రానికి పనిచేస్తున్నాడు.
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

