రెండు సినిమాలు సెట్స్‌లో.. రెండు సినిమాలు ప్రీప్రొడక్షన్‌లో.. ఇలా సెట్ చేశారు పాన్ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ మీదున్నాయి. స్పిరిట్, కల్కి 2 సినిమాలు ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇవిగాక, సలార్ 2, ప్రశాంత్‌వర్మ మూవీ కూడా లైన్లో ఉన్నాయి. బహుశా ఇప్పుడున్న హీరోల్లో ఈ లైనప్ ఎవరికీ లేదేమో!. వీటిలో ముందు రిలీజ్ అయ్యే సినిమా ‘ది రాజాసాబ్’.
ప్రస్తుతం కూల్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. డిసెంబర్ 5న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమాపై ఓ లేటస్ట్ అప్డేట్ వచ్చింది. ఇందులో మొత్తం అయిదు పాటలుంటాయట.
తమన్ స్వరపరిచిన ఈ అయిదు పాటలు.. అయిదు జానర్లలో ఉంటాయని సమాచారం. వీటిలో ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ కాగా, రెండోది రొమాంటిక్ మెలొడీ, మూడోది మాళవిక మోహనన్‌తో మాస్ బీట్ , ‘ది రాజాసాబ్’ థీమ్ సాంగ్ నాలుగోది, వీటన్నింతోపాటు కథానాయికలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లతో కలిసి ప్రభాస్ చేసే ఊరమాస్ సాంగ్ అయిదోది.. ఈ విధంగా దర్శకుడు మారుతి ప్లాన్ చేశారట. తమన్ నెక్ట్స్ లెవల్లో ఈ పాటలను కంపోజ్ చేస్తే, వాటిని మారుతి కలర్ఫుల్గా తెరకెక్కించారట. ఏదేమైనా ‘ది రాజాసాబ్’ డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఓ విజువల్ ఫీస్టే కానున్నదని చెప్పొచ్చు.