Spirit | పోలీస్ పాత్రలో ప్రభాస్ ఊచకోత.. ‘స్పిరిట్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న సందీప్ వంగా
Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సందీప్ వంగా, ఈసారి ప్రభాస్‌ను పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సందీప్ వంగా, ఈసారి ప్రభాస్‌ను పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్ తదితరులు కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ సినిమా అంతర్జాతీయ నేర ముఠాల నేపథ్యంలో సాగే పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ఓ ధైర్యవంతమైన ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. ప్రభాస్ కెరీర్లో పూర్తి స్థాయి పోలీస్ పాత్ర ఇదే కావడం విశేషం. సందీప్ వంగా శైలిలో రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ప్రభాస్ కనిపించనున్నారని తెలుస్తోంది.ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారట. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, మేకోవర్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. పాత్ర కోసం ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారని సమాచారం.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ వంగా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఈసారి కూడా మ్యూజిక్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. చిన్న విరామం తర్వాత హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. పలు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు సందీప్ వంగా టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనాలు ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

