ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ ప్రచార పర్వానికి తెరలేసింది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ ఆయుధం చేతబూని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. భారీ యాక్షన్ హంగులతో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాలోని ప్రధాన భాగాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో పృథీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ వ్యయంతో హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.