Salaar | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ రీసెంట్గా Salaar part-1 Ceasefire టీజర్‌ను విడుదల చేసి ప్రభాస్ అభిమానులను ఖుషీ చేశాడు. ఇదిలా ఉంటే సలార్ కొత్త న్యూస్ ఏం రాబోతుందని ఎదురుచూస్తున్న వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. Salaar Ceasefire ఫస్ట్ సింగిల్‌ను స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్త రౌండప్ చేస్తోంది. దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. మిలియన్లకుపైగా వ్యూస్ రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది టీజర్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ పోషిస్తున్నాడు. సలార్ పార్ట్-1 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై విజయ్ కిరగందూర్ సలార్‌ను తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్-2 ఎప్పుడు రిలీజవుతుందనే దానిపై క్లారిటీ రావాలంటే పార్ట్ 1 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రశాంత్ నీల్ కాంపౌండ్ నుంచి వచ్చిన కేజీఎఫ్ ప్రాంఛైజీ, ప్రభాస్ నటించిన ప్రాంఛైజీ బాహుబలి ప్రాంఛైజీ గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో.. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ రెండు సినిమాల రికార్డులను బీట్ చేయడం ఖాయమని టీజర్‌తో అర్థమవుతోంది. ప్రభాస్ మరోవైపు మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో నటిస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD).
ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా.. నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా మారింది. గ్లింప్స్ వీడియో హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ రాబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ మరోవైపు మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ లో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
సలార్ టీజర్..