Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ కాంపౌండ్ నుంచి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ (Salaar). ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన Salaar Part-1 Ceasefire బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మరోవైపు సలార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా తన హవా ఏంటో చూపించింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో కూడా సలార్ ఫీవర్ కొనసాగుతూ.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్స్‌లో అత్యధిక వ్యూయర్షిప్తో నంబర్ 1 స్థానంలో నిలిచింది.
తాజాగా అరుదైన ఫీట్ సలార్ ఖాతాలో చేరిపోయింది. సలార్ ఇన్స్టాగ్రామ్ పేజీలో 246K ఫాలోవర్లతో అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ రికార్డు నమోదు చేసిన నాలుగో సినిమాగా సలార్ నిలువగా.. Kalki 2898 AD 250k ఫాలోవర్లతో మూడో స్టానంలో నిలిచింది. సోషల్ మీడియా పేజీల్లో ఫాలోవర్లు అత్యధికంగా సంపాదించుకున్న నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు ప్రభాస్ కావడం విశేషం. ప్రభాస్ సినిమాలకు క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పేందుకు ఈ ఒక్క విషయం చాలంటున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్.
సలార్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 గ్లోబల్ చార్ట్స్ (నాన్ ఇంగ్లీష్ కేటగిరి)లో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఓటీటీలో రిలీజైన తొలి వారంలోనే వరల్డ్‌వైడ్‌గా ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు సినిమాగా టాప్‌లో నిలిచి హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సీక్వెల్ సలార్ 2లో నటిస్తున్నాడని తెలిసిందే.
సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ , బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు.
#Kalki2898AD‘s Instagram page has crossed 250K followers, making it the third Indian official movie handle to achieve this milestone! #Salaar– 246K. This will be the fourth film to reach this mark, with three of those four films belonging to #Prabhas. 🛐🔥 pic.twitter.com/c2nC7vo904
— Hail Prabhas (@HailPrabhas007) June 19, 2024

Salaar2