Prabhas | శాండల్‌వుడ్‌లో ఉన్న మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీల్లో ఒకరు రిషబ్ శెట్టి (Prabhas). కాంతార సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించాడు. ఇక బాహుబలి ప్రాంఛైజీతో తెలుగు సినిమా రేంజ్‌ను మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్‌కు చూపించాడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు.
ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహ ఎంత బాగుందో కదా.. ఇప్పుడిదే ఊహ నిజం కాబోతుందన్న క్రేజీ టాక్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. తాజా టాక్ ప్రకారం రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రభాస్ నటించబోయే సినిమా కోసం రిషబ్ శెట్టి కథనందించబోతున్నాడట.
అంతేకాదు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. మరోవైపు రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమాతోపాటు కాంతార చాప్టర్ 1 (ప్రీక్వెల్)లో నటిస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ క్రేజీ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
Fear Trailer | సైలెంట్‌గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్‌గా వేదిక ఫియర్ ట్రైలర్