Project K |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ k. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ జోనర్లో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ప్రాజెక్ట్ k నుంచి మేకర్స్ విడుదల చేసిన దీపికా పదుకొనే లుక్ హాలీవుడ్ సినిమాను గుర్తుకు తెస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రాజెక్ట్ K రెండు పార్టులుగా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు రాగా.. అలాంటిదేమి లేదు.. సింగిల్ పార్ట్‌గా మాత్రమే సినిమా ఉండబోతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరో వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా టాక్ ప్రకారం ప్రాజెక్ట్ K క్లైమాక్స్ లో దీపికా పదుకొనేకు ఓ ప్రమాదం జరుగుతుందట. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది సీక్వెల్లో చూపించబోతున్నారంటూ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. క్లైమాక్స్ మాట అటుంచితే సినిమాకు సీక్వెల్ మాత్రం ఉండే ఛాన్స్ లేదంటూ చిత్రయూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో సీక్వెల్‌పై ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
రీసెంట్గా విడుదలైన పఠాన్‌తో మంచి సక్సెస్ అందుకుంది దీపికా పదుకొనే. మరోవైపు ప్రభాస్ ఓం రౌత్ డైరెక్షన్లో నటిస్తున్న ఆది పురుష్ విడుదల కావాల్సి ఉంది. దీంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ షూటింగ్ దశలో ఉంది.
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023