ప్రీప్రొడక్షన్ అంతా పూర్తి చేసి, బౌండ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసి, హీరో లేని సన్నివేశాలన్నింటి కోసం ఓ షెడ్యూల్ రాసేసి.. ముందు దాన్ని కంప్లీట్ చేసి, అప్పుడు తీరిగ్గా హీరోని పిలిస్తే.. తేలిగ్గా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఈ టెక్నిక్‌నే ఫాలో అవుతున్నారట. ఇప్పటికిప్పుడు ప్రభాస్ దొరకడం అసాధ్యం. అందుకే.. ఆయనతో చేయబోతున్న ‘బ్రహ్మరాక్షస’(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ మొత్తాన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారట ప్రశాంత్‌వర్మ. ప్రతి షాట్, ప్రతీ సీన్ ప్రీ విజువలైజేషన్, ఏ షాట్ ఎలా తీయాలి?
తదితర అంశాలపై కూడా ఆయన పూర్తి క్లారిటీతో ముందుకెళ్తున్నారట. డైలాగ్ వెర్షన్ మినహా స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందని సమాచారం. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలు రాస్తున్నారని తెలిసింది. ముందు ప్రభాస్ లేని సీన్స్ తీస్తారట. ప్రభాస్ తన సినిమాలను పూర్తి చేసుకొని రాగానే, తక్కువ సమయంలోనే ‘బ్రహ్మరాక్షస’ను పూర్తి చేసేయాలనే ప్రణాళికతో ప్రశాంత్‌వర్మ ఉన్నారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా లాంఛనంగా మొదలయ్యే అవకాశం ఉంది.