Prabhas | ‘బాహుబలి’ రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్. ఆ స్థాయి భారీ ప్రాజెక్ట్‌లే తప్ప మరొకటి ఎంచుకోలేనంత ఇమేజ్‌కు చేరుకున్నారాయన. అలాంటి గుర్తుండిపోయే చిత్రాన్ని తనకు అందించిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియాతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఆర్కా మీడియా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తాజాగా ప్రభాస్‌తో ఓ సినిమా గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది.
ఈ ప్రాజెక్ట్ వివరాలు విన్న ప్రభాస్ కూడా అంగీకారం తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే ప్రభాస్ కెరీర్లో మరో భారీ చిత్రం కానుంది. కథానాయకుడిగా ప్రభాస్‌ను ఈ సినిమా సరికొత్తగా ఆవిష్కరించనుందట. ఈ కొత్త సినిమా ‘బాహుబలి 3’ అనే మాటలూ వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి మహేశ్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తవడానికే కనీసం రెండేండ్ల సమయం కావాలి. మరోవైపు ప్రభాస్ కూడా దాదాపు అరడజను చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆయన ఖాతాలో ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’, ‘స్పిరిట్’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్), బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ఓ సినిమా ఉన్నాయి.