ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే, ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.ఇదిలాఉంటే ప్రభాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడట.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ఉండబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్. అభిమానులు చాలా ఎక్జయిట్ అయ్యేలా ఉన్న ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై కొత్త కాంబినేషన్ప్రేక్షకులకు థ్రిల్ అందిచడం ఖాయమైనట్టేంటున్నారు సినీజనాలు. ప్రస్తుతం షారుక్‌ఖాన్‌తో పఠాన్ సినిమా చేస్తున్నాడు సిద్దార్థ్ ఆనంద్. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
మరోవైపు ఫైటర్, వార్ 2 సినిమాలు కూడా సిద్దార్థ్ ఆనంద్ ఖాతాలో ఉన్నాయి. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్ విడుదల తేదీ ఫిక్సయింది. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.