Arshad Warsi – Prabhas | బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు విషయం తెలిసిందే. కల్కి సినిమాను ఉద్దేశించి మాట్లాడుతూ.. కల్కి సినిమాలో ప్రభాస్ ఒక జోకర్లా ఉన్నాడు. కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించింది. అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ అర్షద్ చెప్పుకోచ్చాడు. అయితే అర్షద్ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టాలీవుడ్‌ను అనేముందు బాలీవుడ్ ఎలా ఉందో చూసుకోవాలని తెలిపారు. అయితే వ్యాఖ్యలపై దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా స్పందించడం విశేషం.
అయితే ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా మరోసారి అర్షద్ వార్సీ ఈ వివాదంపై స్పందించాడు. అబుదాబిలో జరిగిన ఐఫా ఈవెంట్లో పాల్గోన్న అర్షద్ మీడియాతో మాట్లాడుతుండగా.. ఒక లేడి రిపోర్టర్ ప్రభాస్ ని కామెంట్ చేసిన దాని గురించి అడిగింది. దీంతో అర్షద్ వార్సీ తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్ గురించి నేను మాట్లాడిన మాటలు తప్పుడు మార్గంలో వెళ్లాయి. అందరికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లకు ఉంటుంది. నేను కేవలం కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర గురించే మాట్లాడాను. వ్యక్తి గురించి మాట్లాడలేదు. ప్రభాస్ ఒక బ్రిలియంట్ యాక్టర్. అతను ఇది చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఒక మంచి నటుడికి బ్యాడ్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ అది అస్సలు ఒప్పుకోరు అంటూ అర్షద్ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
#Prabhas is a Brilliant Actor
– #ArshadWarsipic.twitter.com/EPdrVpm21G
— Milagro Movies (@MilagroMovies) September 29, 2024