Prabhas -Hanu Raghavapudi Movie | ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్-k’ ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు ప్రభాస్. అంత బిజీ షెడ్యూల్స్‌లోనూ కథలు వింటూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సీతారామంతో తిరుగులేని హిట్టు కొట్టిన హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, త్వరలోనే అఫీషియల్ ప్రకటన ఉంటుందని సమాచారం. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హను రాఘవపూడి.. ప్రభాస్ కోసం రూటు మార్చాడని తెలుస్తుంది.
వీళ్ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా లవ్‌స్టోరీ కాదని, వరల్డ్ వార్ పీరియడ్ డ్రామా అని టాక్. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని ఇదే ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హను ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతుందట. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.