Prabhas | అగ్ర కథానాయకుడు ప్రభాస్ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో షూటింగ్ కోసం లండన్ వెళ్లినప్పుడు ప్రభాస్ అదే ఇంటిలో బస చేసేవాడని, తన అభిరుచికి తగిన ఇల్లు కావడంతో భారీగా అద్దె చెల్లించేవాడని తెలిసింది. కొద్దిరోజుల క్రితం ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో ప్రభాస్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడని అంటున్నారు.
అయితే ఈ వార్తల్లో నిజమెంతో అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది. కమల్‌హాసన్, దీపికా పడుకోన్, అమితాబ్‌బచ్చన్, దిశా పటానీ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్.