e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News విక్రమాదిత్య ఎవరు?

విక్రమాదిత్య ఎవరు?

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న చిత్ర టీజర్‌ను విడుదలచేయబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘దాదాపు పదేళ్ల విరామం తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ఇది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో యూరప్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో విక్రమాదిత్య అనే యువకుడిగా ప్రభాస్‌ కనిపించబోతున్నారు. అతడు ఎవరు అనే ప్రశ్నకు టీజర్‌ సమాధానం చెబుతుంది. ప్రేరణగా పూజాహెగ్డే క్యారెక్టర్‌ అభినయప్రధానంగా సరికొత్తగా ఉంటుంది. 2022 జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. దక్షిణాదితో పాటు హిందీ భాషలోనూ విడుదలచేయనున్నాం’ అని తెలిపారు. కృష్ణంరాజు,, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీశర్మ, కునాల్‌రాయ్‌కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, మిథున్‌, అనూమాలిక్‌, మనన్‌భరద్వాజ్‌(హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహాంస.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement