యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కురి దర్శకుడు. సురేశ్‌కుమార్ సడిగే, నిశాంత్ నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ద్వారా టైటిల్‌ని లాంచ్ చేశారు. గ్రామీణ వాతావరణానికి చెందిన సంప్రదాయాలు, విశ్వాసాల సమాహారంగా మోషన్‌పోస్టర్ ఉంది. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రణయ్‌రెడ్డి వంగా మాట్లాడుతూ ‘మంచి కథని చూపించటానికి టీమ్ మొత్తం ఎంత కష్టపడ్డారో కళ్లతోనే చూశాను.
నటీనటుల నటనే కాదు, సాంకేతికంగా కూడా గొప్పగా ఉంటుంది సినిమా’ అని చెప్పారు. కొన్నేళ్లపాటు గుర్తుండిపోయే సినిమా ఇదని అనన్య నాగళ్ల అన్నారు. వినోదం, సందేశం మిళితమైన కథతో ఈ చిత్రం రూపొందిందని యువచంద్ర కృష్ణ చెప్పారు. కథ రాసేటప్పుడు ఉన్న ఎమోషన్స్ ఇంకా తనలో అలాగే ఉన్నాయని, వరంగా వచ్చిన ఆలోచనే ఈ కథ అని దర్శకుడు తెలిపారు. ఇంకా నిర్మాతలు కూడా మాట్లాడారు. అజయ్, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్‌సేన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: మోనిష్ భూపతిరాజు.