Sekhar Kammula | తెలుగు సినిమా బాక్సాఫీస్ మంత్రంగామారిన తెలంగాణ భాష, సంస్కృతి: దర్శకుడు శేఖర్ కమ్ముల
తెలంగాణ భాష, సంస్కృతి తెలుగు సినిమా బాక్సాఫీస్ మంత్రంగామారాయని అంటున్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. తెలంగాణయాసతో సినిమా తీస్తే విజయం తథ్యమనే భావన ఏర్పడిందని, ఒకప్పుడు వెండితెర మీద అవహేళనకు గురైన తెలంగాణ యాస ఇప్పుడు సక్సెస్ సీక్రెట్‌గా మారిందని చెబుతున్నారు.
Sekhar Kammula | తెలంగాణ భాష, సంస్కృతి తెలుగు సినిమా బాక్సాఫీస్ మంత్రంగామారాయని అంటున్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. తెలంగాణయాసతో సినిమా తీస్తే విజయం తథ్యమనే భావన ఏర్పడిందని, ఒకప్పుడు వెండితెర మీద అవహేళనకు గురైన తెలంగాణ యాస ఇప్పుడు సక్సెస్ సీక్రెట్‌గా మారిందని చెబుతున్నారు. ‘ఇది మన తెలంగాణ సినిమా’ అని అందరూ గర్వంగా చెప్పుకొనే స్థాయికి చేరుకుందని గుర్తుచేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శేఖర్ కమ్ముల ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. దశాబ్ద కాలంగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సినీ రంగంలో చోటుచేసుకున్న మార్పుల గురించి ఆయన అంతరంగ ఆవిష్కరణ ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్లు అవుతున్నది. ఈ కాలంలో తెలంగాణ నేపథ్య కథాంశాలతో సినిమాల నిర్మాణం ఊపందుకుంది. వ్యక్తిగతంగా ఈ తరహా సినిమాల విషయంలో మీరు గమనించిన మార్పులు ఏమిటి?
పదేండ్ల ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ నేపథ్యం, యాస, భాష పెట్టకపోతే ఆ చిత్రాలు ఆడవేమో అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాక ముందు ఈ భాషను క్యారికేచర్‌లా, హాస్యాస్పదంగా, విలనిజానికి సింబల్‌గా కించపరచడం చూశాను. ఇప్పుడు ఆ స్థాయి నుంచి తెలంగాణ నేపథ్యం, భాష మెయిన్ స్ట్రీమ్ సినిమాగా అవతరించింది. క్రమక్రమంగా పుంజుకొని ఈ నేపథ్యంలో సినిమా చేస్తే బాక్సాఫీస్ సక్సెస్ అనే స్థాయికి వచ్చింది. ‘ఫిదా’ చిత్రాన్ని బాన్సువాడ నేపథ్యంలో తెరకెక్కించాం. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, కుటుంబ జీవన విధానం ఎలా ఉంటాయో చూపించాలనుకున్నా. ప్రస్తుతం తెలంగాణ భాషతోపాటు గ్రామీణ తెలంగాణకు చెందిన కథలు సినిమాగా రావడం గొప్ప అచీవ్మెంట్. అర్బన్ సిటీ రొమాంటిక్ కథలు కాకుండా, మట్టివాసనతో తీసే పల్లె కథలు కూడా విజయం సాధిస్తాయనే నమ్మకం ఏర్పడింది. ‘ఇది మన తెలంగాణ సినిమా’ అని అందరూ గర్వంగా చెప్పుకొనేలా ఇక్కడి సినిమా ఎదిగింది. దీనిని తెలంగాణ సాధించిన గొప్ప సాంస్కృతిక విజయంగా అభివర్ణించవచ్చు.
ఏ దేశం వెళ్లినా నాకు హైదరాబాదే గుర్తొస్తుంది. ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఇది. ఈ నగరంలోని జీవన వైవిధ్యం, అందరూ మనవాళ్లనే ప్రజల తత్వం ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేస్తుంది. ఈ సంస్కృతిని నేను చాలా ఇష్టపడతాను.
మీరు దర్శకత్వం వహించిన డాలర్‌డ్రీమ్స్, హ్యాపీడేస్, ఫిదా, లవ్‌స్టోరీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాస, నేపథ్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను కాబట్టి తెలంగాణ యాస, భాష అలవాటైంది. సాధారణంగా నా సినిమాలు వాస్తవికతను ప్రతిబింబిస్తూ సహజంగా ఉంటాయి. సంభాషణల పరంగా పోయెటిక్ టచ్‌తో గంభీరంగా రాసే అలవాటు నాకు లేదు. నావన్నీ మధ్య తరగతి సామాన్యుల కథలు. వాళ్లు జనరల్‌గా ఎలా మాట్లాడుకుంటారో అవే నా సినిమాల్లో సంభాషణలుగా వినిపిస్తాయి. ‘డాలర్ డ్రీమ్స్’ నుంచీ నా శైలి అలాగే కొనసాగుతున్నది. నాకు తెలిసిన, పుట్టి పెరిగిన వాతావరణం నేపథ్యంలోనే నేను కథలు రాస్తాను. నాకు తెలంగాణ భాషపై మంచి పట్టుంది. ఇక నేను ఎంచుకునేది రియల్ సినిమా కాబట్టి భావోద్వేగాలు, భాష సహజంగా కనిపిస్తాయి.
ప్రస్తుతం అగ్ర హీరోలు, దర్శకులు సైతం తెలంగాణ నేపథ్య సినిమాల పట్ల మక్కువ చూపిస్తున్నారు? మీ సినిమాలు చూస్తే ఈ మార్పును మీరు గతంలోనే ఊహించినట్లుగా అనిపిస్తున్నది?
అదృష్టం కొద్ది నాకు అలాంటి అవకాశాలు దొరికాయి. నేను ఈ మార్పును ముందే ఊహించాను. ఏ ప్రాంత నేపథ్య కథ అయినా ఎంత నిజాయతీగా చెబుతున్నాం అనేది చాలా ముఖ్యం. 15 సంవత్సరాల క్రితమే నేను మల్టీప్లెక్స్ సినిమాలు, ఓటీటీ ట్రెండ్ వస్తుందని ఊహించాను. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకొంటాను. స్టార్ హీరోల మీద ఆధారపడకుండా సహజమైన కథలతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని కూడా చెప్పాను. ఇప్పుడు అవన్నీ నిజమవుతున్నాయి.
తెలుగు సినిమాతోపాటు సమాంతరంగా తెలంగాణ సినిమా కూడా ఎదగడం వల్ల ఇక్కడి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు పెరిగాయి? ఈ పరిణామంపై మీ స్పందన?
తెలంగాణ రాక ముందు సినిమా అంటే చాలా పెద్ద విషయం. ‘సినిమా ఇండస్ట్రీ ఎక్కడో దూరంగా ఉంటుంది.. అక్కడ అడుగుపెట్టాలంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం’ అనుకునేవాళ్లు. ఇప్పుడు ఆ భ్రమలన్నిటినీ తెలంగాణ సినిమా పటాపంచలు చేసింది. కథను సక్సెస్‌ఫుల్‌గా చెబితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం కలిగించింది. మన ప్రాంతం, మన యాస నేపథ్యంలో మంచికథను అందించే ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇందుకోసం ఎలాంటి శిక్షణ అవసరం లేదని, కథను అందంగా, ఆలోచనాత్మకంగా చెప్పగలిగితే విజయం తథ్యమనే భరోసా కలిగింది. ఇరవై ఏండ్లనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. నిజాయతీగా సినిమా తీస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ దిశగా తెలంగాణ ఇతివృత్తాలు కొత్త ట్రెండ్‌కు బీజం వేస్తున్నాయి. సృజనాత్మకత ఉంటే సినిమా తీయొచ్చనే నమ్మకం బాగా పెరిగింది.
తెలంగాణ సినిమా మరింత అభివృద్ధి పథంలో పయనించడానికి ఒక సీనియర్ దర్శకునిగా మీరిచ్చే సూచనలు ఏమిటి?
తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ విషయంలో అంకితభావంతో పనిచేస్తున్నారు. మరుగునపడిన ప్రాచీన కళలను, కళాకారులను వెలికితీసి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓ ఫిల్మ్‌స్కూల్ ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా.
సినిమా షూటింగ్ అంటే ఒకప్పుడు అందరికీ కోనసీమ గుర్తొచ్చేది? ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో షూటింగ్ సందడి నెలకొంటున్నది. మన లొకేషన్లపై మీ అభిప్రాయం?
ఇంతకుముందు పల్లెటూరి నేపథ్యంలో సినిమా అనగానే కోనసీమలో షూటింగ్ చేసేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ కూడా అందమైన లొకేషన్స్ వెలుగులోకి వచ్చాయి. ‘ఫిదా’ చిత్రీకరణ కోసం వెళ్లినప్పుడు బాన్సువాడలో లొకేషన్స్ చూసి షాక్ అయ్యాను. బ్యూటిఫుల్ జాగ్రఫీ తెలంగాణ సొంతం. ‘ఫిదా’ చిత్రంలో అమెరికాలో తీసిన సన్నివేశాల తెలంగాణలోని లొకేషన్స్‌నే చాలా అందంగా చూపించాను. కోనసీమ, గోదావరి అందాలను తలపించేలా తెలంగాణలో లొకేషన్స్ కనిపిస్తున్నాయి. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. ఏ పల్లెకు వెళ్లినా పండుగ వాతావరణమే దర్శనమిస్తున్నది.
కేటీఆర్ గ్రేట్
హైదరాబాద్ నగరం అద్భుతమైన అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. ఇంజినీరింగ్ చేసే సమయంలో అమెరికా జీవనవిధానం, అక్కడి విలాసవంతమైన సౌకర్యాలు చూస్తే చాలాగొప్పగా అనిపించేది. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆల్మోస్ట్ అమెరికాను తలపిస్తుంది. ఈ మార్పును నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కడా చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ అందరికీ అందుబాటులో ఉండటం చాలాగ్రేట్. ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ప్రభు త్వం అంటే ప్రజలకు దూరంగా ఎక్కడో ఉండేది కాదని, ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే రీతిలో కేటీఆర్ పనిచేస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్‌ను అభినందించాల్సిందే!
…? మడూరి మధు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

