అందాల తార పూజా హెగ్డే బ్యాడ్ టైమ్ కొనసాగుతున్నది. గత రెండేండ్లుగా సక్సెస్ అనే మాటే పూజా చెవిన పడటం లేదు. ‘అలవైకుంఠపురములో’ తర్వాత ఈ అందాల తార నటించిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నాయిక బాలీవుడ్లో రణ్‌వీర్‌సింగ్ సరసన నటించిన కొత్త సినిమా ‘సర్కస్’ తాజాగా విడుదలై నెగెటివ్ రివ్యూస్, మౌత్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజు ఏడున్నర కోట్లు మాత్రమే రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నది.
రణ్వీర్ సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో గతంలో వచ్చిన చిత్రాలు ఇంతకు రెట్టింపు డే వన్ కలెక్షన్స్ సాధించాయి. ఆ ట్రాక్ రికార్డ్‌తో చూస్తే ‘సర్కస్’కు వస్తున్న ఆదరణ చాలా తక్కువే అంటున్నారు. ఏమైనా ఓ హిట్‌తో ఏడాదికి ముగింపు పలికి, న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుదామనుకున్న పూజా కోరిక నెరవేరలేదు.