Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ రూమర్ బయటకు వచ్చింది.
ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరవబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై పూజను చిత్రయూనిట్ సంప్రదించగా.. పూజ ఓకే చేసినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూజ హెగ్డే ఇంతకుముందు రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాలో జిగేలు రాణి అంటూ ఐటెం సాంగ్‌తో మెరిసింది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.