సాధారణంగా పార్టీ అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ కానీ వ్యక్తులు కలిసి చేసుకుంటారు. టాలీవుడ్ (Tollywood) భామ పూజా హెగ్డే (Pooja Hegde) పార్టీ చేసుకుంది. మరి ఈ భామతో పార్టీలో ఎవరున్నారనుకుంటున్నారా..? ఎవరూ లేరు. ఒంటరిగానే పార్టీ చేసుకుంది పూజా హెగ్డే. అవును మీరు విన్నది నిజమే.నాతో నేను పార్టీ చేసుకున్నా. డ్యాన్స్ చేశానంటూ సింగిల్ గా పార్టీ మూడ్ లో ఉన్న స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నేను మద్యం సేవించలేదు..మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. కానీ నేను హుందాగా ఉన్నా. అదృష్టవశాత్తు..దాన్ని వదులుకోవాలంటే ఏమీ అవసరం లేదు..అంటూ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసింది.
పూజాహెగ్డే ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అరుదైన మైలురాయిని చేరుకున్నందుకు సహకరించిన తన టీంకు ధన్యవాదాలు తెలిపింది. హెయిర్ స్టైలిష్ట్ సుహాస్, మేకప్ ఆర్టిస్ట్ కాజోల్, రామ్ అసిస్టెంట్, కుక్ శంటి , కాస్ట్యూమ్ అసిస్టెంట్ బాలాజీలను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో ఇప్పటికే వైరల్ అయింది.
పూజాహెగ్డే చేతిలో ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ (Most Eligible Bachelor), బీస్ట్ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అక్టోబర్ 8న విడుదల కానుండగా..రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. విజయ్ తో నటిస్తోన్న బీస్ట్ చిత్రీకరణ దశలో ఉంది.
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!