Pooja Hegde Own Dubbing : పూజా సొంత గళం

పాత్రలో సహజత్వం, వాస్తవికత కనిపించడం కోసం అరువు గొంతులకు స్వస్తి పలికి సొంత గళాన్ని వినిపించడానికి ఉద్యుక్తులవుతున్నారు అగ్రకథానాయికలు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా కోసం పూజాహెగ్డే సొంతంగా డబ్బింగ్ చెబుతోంది. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ నిర్మిస్తున్నారు. తన పాత్ర కోసం పూజాహెగ్డే డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను చిత్రబృందం విడుదలచేసింది. తెలుగులో చక్కటి స్పష్టతతో ఆమె డబ్బింగ్ చెబుతున్నట్లు తెలిసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. భిన్న ధృవాల్లాంటి ఓ జంట ప్రేమాయణం ఎలా పెళ్లిపీటలవరకు చేరుకున్నదనేది ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదలచేయబోతున్నాం’ అని తెలిపారు. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

