Pooja hegde | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఈ అమ్మడు అదరగొట్టింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనే హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతగానో మెప్పించింది. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్‌ఫుల్ 4, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో వరుస సక్సెస్ సాధించిన పూజా హెగ్డే ఆ తర్వాత మాత్రం హిట్ కోసం ఎంతో ఎదురు చూసింది. రాధే శ్యామ్ , బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసి కా భాయ్, కిసి కీ జాన్, దేవా, రెట్రో సినిమాలు వరుసుగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వచ్చిన రెట్రో చిత్రంలో డీ గ్లామరైజ్డ్ పాత్ర పోషించగా, దీనిపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాని అది కూడా అభిమానులకు నిరాశను మిగిల్చింది.
తాజాగా ఆమెకు దక్కాల్సిన ఓ క్రేజీ కోలీవుడ్ ఆఫర్ మిస్ అయినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, విగ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకునే యోచనలో ఉండగా, చివరికి ఆమె స్థానంలో మలయాళ బ్యూటీ మమితా బైజును ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మమితా బైజు, ‘ప్రేమలు’ సినిమా ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా దళపతి విజయ్, సూర్య వంటి టాప్ హీరోల ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూ, దక్షిణాది చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుంది. ఇప్పుడు ధనుష్ సినిమా అవకాశం దక్కడంతో ఆమె కెరీర్ దూసుకుపోయే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఆమె మార్కెట్లో కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలికమేనని, ఆమె బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్ముతున్నారు.అ యితే ఈ ఒక్క సినిమా మిస్ అయినా, పూజా చేతిలో ప్రస్తుతం రజనీకాంత్, విజయ్, రాఘవ లారెన్స్ లాంటి స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌లతో బిజీగా ఉన్న పూజా, త్వరలోనే మళ్లీ ఫాంలోకి వస్తారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.