Pooja Hegde | ఆ విషయంలో తగ్గేదేలేదంటున్న మంగళూరు సోయగం
ఒకప్పుడు తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అయ్యింది మంగళూరు సోయగం పూజా హెగ్డే. వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు సంపాదించుకొని సత్తా చాటింది. అయితే గత కొంతకాలగా ఈ భామకు అదృష్టం కలిసి రావడం లేదు.
Pooja Hegde | ఒకప్పుడు తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అయ్యింది మంగళూరు సోయగం పూజా హెగ్డే. వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు సంపాదించుకొని సత్తా చాటింది. అయితే గత కొంతకాలగా ఈ భామకు అదృష్టం కలిసి రావడం లేదు. తెలుగు, హిందీ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు పరాజయం పాలవడంతో రేసులో పూర్తిగా వెనకబడింది. అయితే తమిళంలో ఇటీవలే సూర్య చిత్రంలో అవకాశాన్ని దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందనే ఆశాభావంతో ఉంది పూజాహెగ్డే.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పూజాహెగ్డే రెమ్యునరేషన్‌ను పెంచినట్లు తెలిసింది. గతంలో ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది పూజాహెగ్డే. అయితే సూర్య సినిమాకు మాత్రం నాలుగు కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నదని తెలిసింది. పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, డేట్స్ కూడా పెద్ద మొత్తంలో కేటాయించాల్సి రావడంతో పూజాహెగ్డే రెమ్యునరేషన్ పెంచిందని అంటున్నారు. అవకాశాలు తగ్గిపోయినా పారితోషికం విషయంలో ఏమాత్రం తగ్గేదేలేదన్నది పూజాహెగ్డే నిర్ణయమని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్, కల్యాణ్ సుబ్రమణియం, సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. త్వరలో
టైటిల్‌ను ప్రకటించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

