Actress Pooja hegde | నిన్న,మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ఆమె సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి పూజానే కావాలన్నారంటే ఆమె ఎంత లక్కీ చార్మో అర్థం చేసుకోవచ్చు. అయితే అదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. గత రెండేళ్లుగా పూజా సినీ కెరీర్ చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తర్వాత పూజా నటించిన 6 సినిమాలు పెవీలియన్ బాట పట్టాయి. సౌత్‌లో ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్‌కు వెళ్తే.. నార్త్‌లో కూడా ఇదే పరిస్థితి.
గంపెడంతో ఆశలు పెట్టుకున్న ‘సర్కస్’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ఘోరంగా ఫ్లాప్ అయింది.ఇక ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సైతం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడుగా ముందుగా కమిట్ అయిన గుంటూరు కారం, ఉస్తాద్ నుంచి తప్పుకోవడంతో పూజాకు ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. ఇక పూజా పనైపోయింది అని అనుకుంటున్న టైమ్‌లో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ ఇస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే నార్త్‌లో రెండు సినిమాలకు సైన్ చేసిన పూజా ఇప్పుడు సౌత్‌లోనూ మూడు సినిమాలు చేస్తుందని టాక్.
మెగా మేనల్లుడు సాయిధరమ్‌కు జోడీగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజానే హీరోయిన్గా ఆల్మోస్ట్ ఫిక్సయిపోయిందట. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న 4వ సినిమాలోనూ పూజనే హీరోయిన్గా అనుకుంటున్నారట. ఇక ఇప్పటికే కార్తి సరసన అవారా-2లో పూజాను ఫిక్స్ చేశారు. ఇలా ప్రస్తుతం సౌత్‌లోనే మూడు ప్రాజెక్ట్‌లను పెట్టుకుంది. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్టయిన పూజా మేనియా మరికొన్నేళ్లు సాగుతుంది.