Polimera Movie | పొలిమేర మూవీ నిర్మాతల మధ్య వివాదం కొత్త మలుపు తీసుకున్నది. పొలిమేర 3 నిర్మాతపై గౌరీ కృష్ణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్‌పై పొలిమేర-2 మూవీని గౌరీ కృష్ణ నిర్మించారు. వంశీకృష్ణ నందిపాటి నిర్మాతగా ఇటీవల పొలిమేర-3ని ప్రకటించిన విషయం తెలిసిందే. పొలిమేర-2 మూవీకి వంశీకృష్ణ పంపిణీదారుగా ఉన్నారు. అయితే, పొలిమేర-2 సంబంధించిన డబ్బులు వంశీకృష్ణ ఇవ్వాలి ఉందని.. తన అనుమతి లేకుండానే పొలిమేర-3 సినిమాను అనౌన్స్ చేరని.. తనకు న్యాయం చేయాలంటూ ఆయన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో గౌరీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధ్యక్షుడు దిల్ రాజుకు లేఖ రాశారు. గత ఏడాది నవంబర్ 27న వంశీకృష్ణ నందిపాటి, ఆయన బృందంపై ఫిర్యాదు చేశానని.. దాన్ని పరిశీలించాలని కోరారు. ఫిలిం ఛాంబర్‌కు చెందిన నిర్మాత ప్రసన్నకుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వివాదంలో తలదూర్చడంతో పాటు తను బెదిరింపులకు గురి చేస్తున్నాడని.. పలు డాక్యుమెంట్లపై సంతకం చేయాలని బెదిరిస్తున్నారని.. మరో వైపు వంశీకృష్ణ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. రిఫండబుల్ అడ్వాన్స్ బేసిస్‌పై తన వంత వంశీకృష్ణ ఏపీ, తెలంగాణ హక్కులకు సంబంధించి పొలిమేర-2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశాడని తెలిపారు. ఇంత వరకు మూవీ కలెక్షన్ల వివరాలు చెప్పలేదని.. సినిమా విడుదల సమయంలో అడ్వాన్స్ ఇచ్చి నా బ్లాంక్ చెక్కులు, సంతకం లేని బ్లాంక్ లెటర్లు, బాండ్ పేపర్లు సెక్యూరిటీగా తీసుకున్నారని.. అవి వారివద్ద పెట్టుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారని గౌరీకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. పొరమేర-3లో పొరమేర-2 కంటెంట్‌ను వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో వచ్చింది ‘మా ఊరి పొలిమేర’. 2021లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన మూవీ హిట్‌గా నిలిచింది. తొలి భాగాన్ని మధుపల్లి భోగేంద్ర నిర్మించగా.. రెండో పార్ట్‌ని గౌరీకృష్ణ నిర్మించారు. తాజాగా పొలిమేర-3 ప్రకటించారు.