రవికాలె, అజయ్‌ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధన్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. పోలీసును తుపాకులతో కట్టి బంధించిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.
వినూత్నమైన కథాంశంతో సామాజిక సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత బెల్లి జనార్ధన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కొండపల్లి నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, రచన-దర్శకత్వం: బాబ్జీ.