“ఏజెంట్’ సినిమా ఎన్నో మరపురాని అనుభవాల్ని మిగిల్చింది. శారీరకంగా, మానసికంగా నా జీవితంలో గొప్ప మార్పుని తీసుకొచ్చింది’ అన్నారు హీరో అఖిల్ అక్కినేని. ఆయన కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ నెల 18న కాకినాడలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడాల్సి ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి ముందే చెప్పారు. ఎంతటి కష్టానికైనా సిద్ధమేనని ఆరోజే ఆయనకు మాటిచ్చాను. సినిమాలో నేను సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నానంటే ఆ క్రెడిట్ సురేందర్ రెడ్డిదే. రొమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది’ అన్నారు.
‘ఈ సినిమా కోసం అఖిల్ చాలా శ్రమించాడు. దాదాపు ఏడాది పాటు ఒకే రకమైన ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేశాడు. అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎంతో ప్రత్యేకమైనదీ చిత్రం. అతను ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. ఈ సినిమా ద్వారా అఖిల్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని గర్వంగా చెబుతున్నా’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమా అందరి అంచనాల్ని అందుకుంటుందని, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినందిస్తుందని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. తన కెరీర్లోనే ఇదొక అద్భుత అవకాశమని హీరోయిన్ సాక్షి వైద్య పేర్కొంది.