Director Ashok Babu | హీరోగా ఛాన్స్ ఇస్తానని రూ.3.5 కోట్ల మోసం.. ‘పిల్ల జమిందార్’ దర్శకుడు అశోక్ బాబుపై కేసు!
Ashok Babu | తెలుగు సినిమా రంగంలో హీరోగా ఎంట్రీ ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడిన వ్యవహారంలో టాలీవుడ్ హిట్ చిత్రం ‘పిల్ల జమిందార్’ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మి లపై సైబరాబాద్ పోలీస్ పరిధిలో కేసు నమోదైంది.
Ashok Babu | తెలుగు సినిమా రంగంలో హీరోగా ఎంట్రీ ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడిన వ్యవహారంలో టాలీవుడ్ హిట్ చిత్రం ‘పిల్ల జమిందార్’ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మి లపై సైబరాబాద్ పోలీస్ పరిధిలో కేసు నమోదైంది. బాధితుల కథనం ప్రకారం.. ఒక యువకుడిని టాలీవుడ్లో హీరోగా పరిచయం చేస్తామంటూ నమ్మించిన దర్శకుడు అశోక్ బాబు, సదరు యువకుడి తల్లిదండ్రుల నుండి విడతల వారీగా దాదాపు రూ.3.5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే, డబ్బులు తీసుకుని చాలా కాలం గడుస్తున్నా సినిమా ఊసే ఎత్తకపోగా, యువకుడిని హీరోగా లాంచ్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనితో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా నిలదీశారు. తీసుకున్న భారీ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కూడా నిరాకరించడంతో, బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి (EOW) చెందిన పోలీసులు దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. టాలీవుడ్లో ఈ తరహా మోసం బయటపడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

