Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 2న హైదరాబాద్‌లో ఈ భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా.. ఇప్పటికే అభిమానుల్లో మాత్రం ఈ ఈవెంట్‌పై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. అదే థీమ్‌ను ప్రతిబింబించేలా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. స్టేజ్ డిజైన్ నుంచి ఎంట్రీల వరకు ప్రతిదీ విలేజ్ స్పోర్ట్స్ కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా ఉండేలా ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారట. ప్రేక్షకులు, అభిమానులు ఒక కొత్త అనుభూతిని పొందేలా ఈవెంట్‌ను విజువల్ ఫీస్ట్‌గా మార్చేందుకు టీమ్ కసరత్తు చేస్తోందని సమాచారం.
ఇక ఈ భారీ వేడుకకు వేదికగా ఎల్బీ స్టేడియం ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ఎన్నో సినీ ఈవెంట్లు, రాజకీయ సభలు విజయవంతంగా నిర్వహించిన ఈ స్టేడియంలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొనే అవకాశం ఉండటంతో.. ‘పెద్ది’ టీమ్ కూడా అదే వేదికను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు వేలాదిగా హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో పెద్ద వేదిక అవసరమని భావించినట్టుగా సమాచారం. అంతేకాదు, ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని కూడా ప్రచారం జరుగుతోంది. మేకర్స్ ఈ ఈవెంట్‌ను కేవలం సినిమా ప్రమోషన్‌గా కాకుండా.. అభిమానులకు ఓ మెగా సెలబ్రేషన్‌లా మార్చాలని భావిస్తున్నారట. ఇప్పటికే సోషల్ మీడియాలో “జూన్ 2 – ఎల్బీ స్టేడియం” అంటూ పోస్టులు వైరల్ అవుతుండగా.. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘పెద్ది’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమా పై బజ్ మరింత పెరుగుతోంది.