Peddi |ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో తన కొత్త ప్రాజెక్ట్ ‘పెద్ది’పై దృష్టి సారించారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రారంభం నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే మేకర్స్ ప్రతీ చిన్న అప్డేట్ను ఎంతో కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టాయి. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ఆయన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పడంలో సందేహమే లేదు. మేకర్స్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మూవీ నుండి విడుదల కానున్న ఫస్ట్ సింగిల్‌పై కూడా భారీ అంచనాలున్నాయి. దసరా సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ పాట విడుదల కాలేదు. తాజా సమాచారం ప్రకారం, పెద్ది ఫస్ట్ సింగిల్ పూర్తిగా రెడీగా ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ను షూట్ చేసి, లిరికల్ వీడియోలో యాడ్ చేసిన తరువాతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట
అందుకే దసరాకు పాట విడుదల చేయకుండా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ పాట ఒక మంచి లవ్ ట్రాక్ అని, రెహమాన్ దాన్ని ఎంతో ఫ్రెష్‌గా కంపోజ్ చేశారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నదిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని బలమైన అంశాలతో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా, 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్న ఈ సినిమా, రామ్ చరణ్‌కు మరొక బ్లాక్‌బస్టర్‌ను తెచ్చిపెడుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.