Peddha Kapu 1 OTT | కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పెదకాపు 1. అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ (Virat Karrna) ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సెప్టెంబరు 29న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెదకాపు 1 సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్గా నటించగా.. రావు రమేశ్, నాగబాబు, అనసూయ, ఈశ్వరీ రావు, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
#Peddhakapu1 pic.twitter.com/dqYb1AKRBa
— Aakashavaani (@TheAakashavaani) October 27, 2023
కథ ఏంటంటే:
1962లో గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల్లో చెలరేగిన అల్లర్లుతో ఈ కథ మొదలౌతుంది. ఇరవై ఏళ్ల తర్వాత అంటే 1982లో ఓ కొత్తపార్టీ పుట్టిన నేపధ్యంలో అసలు కథ తెరపైకి వస్తుంది. సత్యరంగయ్య (రావు రమేష్) బయన్న ( నరేన్) బద్ద శత్రువులు. తమ అధికార కోసం బలహీన వర్గాలని వాడుకొని, అవమానించి, అలజడులు సృష్టించి, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) అన్నయ్య లీల( వికాస్) సత్యరంగయ్య వద్ద నమ్మిన బంటుగా పని చేస్తుంటాడు. తన కొడుకు కన్నాబాబు ( శ్రీకాంత్ అడ్డాల)ని అవమానించాడన్న కోపంతో బయ్యన్న కొడుకు (విజయ్ రామరాజు) ని దారుణంగా చంపేస్తాడు సత్య రంగయ్య. అయితే ఆ నేరాన్ని తన మీద వేసుకొని జైలు పాలవుతాడు పెదకాపు అన్నయ్య లీల. అయితే జైలు కెళ్లాక లీల కనిపించకుండా పోతాడు. అసలు లీల ఏమయ్యాడు ? పెదకాపు సత్య రంగయ్య, బయన్నలపై ఎలాంటి పోరాటం చేశాడు. ఈ కథలో అక్కమ్మ (అనసూయ) తాయి ( ప్రగతి శ్రీవాస్తవ్ ) గౌరి (బ్రిగడ) మాస్టర్ ( తనికెళ్ళ భరణి ) ఎలాంటి భూమిక పోషించారు. అసలు 1962లో అల్లర్లు చెలరేగడానికి కారణం ఏమిటి ? అనేది తక్కిన కథ.