సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె ఐశ్వర్య కథానాయికగా పరిచయమవుతున్నది. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రధారులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కాసర్ల శ్యాం రచించిన ‘పయనమే’ అనే పాటను విడుదల చేశారు.
అనూప్ రూబెన్స్ స్వరకర్త. మెలోడీ ప్రధానంగా అర్థవంతమైన సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటున్నది. హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని, సున్నితమైన భావోద్వేగాలతో మెప్పిస్తుందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జి.బాలమురుగన్, సంగీతం: అనూప్ రూబెన్స్.