Payal Rajput | ‘మంగళవారం’ సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకుంది పాయల్ రాజ్‌పుత్. అయితే ఇప్పుడు ‘రక్షణ’ అంటూ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా పాయల్‌రాజ్‌పుత్ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘రక్షణ’. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రకాశ్ జోసెఫ్, రమేశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి ట్రైలర్‌ను వదిలారు మేకర్స్.
ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని ఈ మూవీ రానున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. రోషన్, మానస్, రాజీవ్‌కనకాల, వినోద్‌బాల తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: మహతిసాగర్.