దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ .. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన తర్వాతి సినిమాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీలకు సంబంధించిన అప్డేట్స్ పవన్ బర్త్ డే రోజు (సెప్టెంబర్ 2)న రానున్నాయి. ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రం చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ ను ఆగస్టు 15న విడుదల అవుతున్నట్టు తాజాగా అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రానికి సంబంధించి పవన్ బర్త్ డే రోజు కూడా ఓ సర్ప్రైజ్ రానుందట.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ హీరోగా చేస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక హరీష్ దర్శకత్వంలో రానున్న పవన్ మూవీకి సంబంధించి కూడా అప్డేట్ రానుంది.ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా నుంచి కూడా ఓ పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా, బండ్ల గణేష్-భగవాన్-పుల్లారావు నిర్మాణంలో వస్తున్న సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వస్తుందని భావిస్తున్నారు.