భీమ్లానాయక్ (Bheemla Nayak) హంగామా కొనసాగుతోంది. సినిమా విడుదలైన అన్ని థియేటర్లు ఫ్యాన్స్, ఫాలోవర్లు, మూవీ లవర్స్ తో కళకళలాడుతున్నాయి. తమ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను భీమ్లానాయక్ గెటప్‌లో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ మేనియా మామూలుగా లేదు. లేడీ ఫ్యాన్స్ (Lady Fans) అయితే ఓ అడుగు ముందుకేసి కటౌట్లకు పాలాభిషేకం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓ థియేటర్ దగ్గర సిటీవైడ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భీమ్లానాయక్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ యువతి బిల్డింగ్ పైకి గబ్బర్ సింగ్ టవాలును మెడలో వేసుకుని భీమ్లానాయక్ కటౌట్‌ను పాలతో కడిగేసింది. మరోవైపు బిల్డింగ్ కింద బంగారం సినిమాలోని పాటకు ఫ్యాన్స్ స్టెప్పులేస్తూ, ఈలలు వేస్తూ సందడి చేస్తుండటం వీడియోలో చూడొచ్చు. పవన్ కల్యాణ్ క్రేజీ ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క వీడియో చూసి చెప్పేయొచ్చంటున్నారు నెటిజన్లు.
This is called craze 🔥🔥🔥🔥…. #BheemlaNayak #BlockBusterBheemLaNayak pic.twitter.com/V5aXtbZBI0
— Knowledge Is Divine (@BhavadheeyuduPK) February 25, 2022
మరి తొలి రోజే భీమ్లానాయక్ క్రేజ్ ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు భీమ్లానాయక్ సినిమా సక్సెస్‌ను నాగవంశి, త్రివిక్రమ్ అండ్ టీం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.