Jalsa Movie | ‘జల్సా’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల..!
Jalsa Movie Re-Release Trailer | పవన్ కళ్యాణ్ సినిమాల్లో ‘జల్సా’కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి వరుస బ్లాక్ బాస్టర్ల తర్వాత పవన్ కళ్యాణ్‌కు దాదాపు ఏడేళ్ళ వరకు ఒక్క హిట్టు కూడా లేదు. ఎంత త్వరగా స్టార్ అయ్యాడో.. అంతే తొందరగా కిందికి పడిపోయాడు. అయితే వరుసగా 5 సినిమాలు ఫ్లాప్స్ అయిన పవన్ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఫ్యాన్స్ కోసం ఒక్క సినిమా హిట్టయితే చాలు అని అనుకుంటున్న టైంలో పవన్ ‘జల్సా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుండే రికార్డులను క్రియేట్ చేసింది. నైజాంలో 10కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఫస్ట్‌వీక్‌లోనే ఈ చిత్రం రూ.21 కోట్లను సాధించి అరుదైన ఘనతను సాధించింది.
వెయ్యి స్క్రీన్లలో విడుదలైన మొదటి టాలీవుడ్ సినిమాగా ‘జల్సా’ రికార్డు సృష్టించింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను జల్సా మూవీ సాధించింది. కాగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా జల్సా చిత్రం దాదాపు 500 షోస్‌తో సెప్టెంబర్ 2న రీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ‘జల్సా’ రీ రిలీజ్ ట్రైలర్‌ను యువ హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశాడు. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ ‘యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం’ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో ముగుస్తుంది. ఇప్పుడున్న టేస్ట్‌కు తగ్గట్టు ట్రైలర్‌ను బాగా కట్ చేశారు. ఇక ఇప్పటికే చాలా చోట్ల ‘జల్సా’ సినిమాకు హౌస్ బోర్డులు పడ్డాయి. కొన్ని చోట్ల తమ్ముడు సినిమా కూడా రి రిలీజ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

