Varun Tej-Lavanya Thripathi Wedding | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు మరో నాలుగు రోజుల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట నవంబర్ 1న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి ఇటలీ వేదిక కానుంది. ఇటలీలోని టుస్కానీ విలేజ్‌లో వీరిద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయి. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
మెగా ఫ్యామిలీలొ ఒక్కొక్కరుగా ఇటలీకి పయనమయితున్నారు. రీసెంట్గా వరుణ్-లావణ్యలతో పాటు నిహారిక ఇటలీ బయల్దేరిన వీడియోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో కలిసి ఇటలీకి బయల్దేరాడు. వీరిద్దరూ శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ప్రస్తుతం వీళ్ల ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌ను, తన భార్య అన్నాతో కలిసి చూడటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక పెళ్లి తంతులో భాగంగా అక్టోబర్ 30వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక 1వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. అనంతరం నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
BABAI @PawanKalyan Off to Italy With a SWAGGG & STYLE For #VarunLav Wedding ✈️😎🔥
IT’S FAMILYYYY TIME!!Pics and Videos LOADINGG From Italy 🤟🏻🕺💯🤗#PawanKalyan #JanaSena pic.twitter.com/mYK2cecaR2
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 28, 2023