Sai Durga Tej Birthday | టాలీవుడ్ కథానాయకుడు సాయి దుర్గా తేజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
యువ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కష్టే ఫలి అనే మాటను చిత్తశుద్ధితో ఆచరించే తత్వం తేజ్‌కి ఉంది. చిత్రపరిశ్రమలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ప్రతిరోజు ఎంతో తపనతో నటిస్తున్నాడు. సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు. వర్తమాన విషయాలపై స్పందిస్తూ.. రహదారి భద్రత, సోషల్ మీడియాలో అపసవ్య ధోరణులపై చైతన్యపరుస్తున్నాడు. సాయితేజ్ కథానాయకుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంటూ పవన్ రాసుకోచ్చారు.
యువ కథానాయకుడు, సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు సాయి దుర్గా తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కథానాయకుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
– @PawanKalyan@IamSaiDharamTej #HBDSaiDurghaTej pic.twitter.com/QCYodgfteH
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 15, 2025