Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG (They Call Him OG)’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా, తొలి రోజు నుంచే పవర్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఫస్ట్ డే ప్రీమియర్స్‌తో కలిపి OG సినిమా వరల్డ్‌వైడ్ ₹154 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేయడం పవన్ కెరీర్లోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్స్‌లో పవన్‌కి ఇదే అత్యధికం.
రెండు రోజుల ఇండియా కలెక్షన్స్ చూస్తే.. ప్రీమియర్స్ కలెక్షన్: ₹21 కోట్లు, ఫస్ట్ డే (గురువారం): ₹63.75 కోట్లు, సెకండ్ డే (శుక్రవారం): ₹19.25 కోట్లు మొత్తంగా 2 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్లు: ₹104 కోట్లు.ఈ ఫీటుతో పవన్ తన కెరీర్లోనే వేగంగా ₹100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోగా నిలిచారు. పవన్ కల్యాణ్ క్రేజ్ దేశాన్ని దాటి విదేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద OG తొలి రోజు నుంచే 4 మిలియన్ డాలర్ల మార్క్ అందుకొని, రెండో రోజు 4.2 మిలియన్ డాలర్స్ దాటి దూసుకెళ్తోంది. త్వరలోనే 5 మిలియన్ మార్క్ చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
డైరెక్టర్ సుజీత్ పవన్ ఫ్యాన్స్‌కు కావాల్సినటువంటి స్టైల్, యాక్షన్, ఎమోషన్ అన్నీ సమతుల్యంగా మిళితం చేశారు. పవన్ యాక్టింగ్, ఆయన గంభీరత, స్టైల్ స్క్రీన్ మీద చూసి చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. పవర్ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్స్‌కు ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు గూస్బంప్స్ తెప్పించాయి. పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించి మెప్పించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ రికార్డ్ పట్ల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఇది మాస్ రాంపేజ్… రికార్డుల మోత” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “ఇదే పవన్ మ్యానియా అంటూ రచ్చ చేస్తున్నారు.