Pawan Kalyan | టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొన్ని రోజులుగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరో చేతిలో ప్రస్తుతం వినోధయ సీతమ్ రీమేక్(PKSDT), క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజీ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలున్నాయి.
ఏదో ఒక అప్డేట్ అందిస్తూ.. మధ్యలో చిన్నపాటి పొలిటికల్ టూర్ కూడా వేసుకుంటున్నాడు. పవన్ కల్యాణ్ 2024 (AP Politics) టార్గెట్గా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నాలుగు సినిమాలను పూర్తి చేసేందుకు 6 నెలలు డెడ్ లైన్ పెట్టుకున్నాడట. రాబోయే రోజుల్లో ఈ సినిమాలను పూర్తి చేసి.. ఫుల్ టైం జనసేన కార్యక్రమాలపైనే దృష్టిపెట్టాలని ఫిక్స్ అయ్యాడట.
కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ షూటింగ్ స్పీడు చూస్తుంటే.. డెడ్ లైన్లోపే సినిమాలన్నీ కంప్లీట్ అవ్వడం పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలన్నీ పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్ పొలిటికల్ క్యాంపెయిన్లో భాగంగా ఎక్కువగా ఏపీలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
నెట్టింటిని షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్..
ఇప్పటికే ఉస్తాద్ భగత్ గ్లింప్స్ వీడియో విడుదల కాగా.. నెట్టింటిని షేక్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. మరోవైపు ఓజీ షూటింగ్ కూడా జెట్ స్పీడులో కొనసాగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న హరిహర వీరమల్లు ఇప్పటికే 50 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.
కొన్ని రోజుల క్రితం PKSDTకు సంబంధించి కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. ఈ లెక్కన మూడు సినిమాలు జెట్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీలైనంత త్వరలోనే వీటి చిత్రీకరణ పూర్తి కావొచ్చని తాజా అప్డేట్స్ చెబుతున్నాయి. హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ అప్డేట్ వస్తే దాదాపు అన్ని సినిమాలపై క్లారిటీ వచ్చేసినట్టేనంటున్నారు సినీ జనాలు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..