OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్ ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఓజీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై ఇటీవలే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా విడుదల తేదీని అధికారికంగా ఫైనల్ చేస్తూ కొత్త లుక్‌ను షేర్ చేసింది డీవీవీ ఎంటర్టైన్మెంట్. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్‌లో ఛాయ్ గ్లాస్ పట్టుకొని కనిపిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. సుజిత్ ఈ సారి పవన్ కల్యాణ్‌తో బ్లాక్ బస్టర్‌ను ప్లాన్ చేశాడని తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వెంకట్ (venkat) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే వెంకట్ బూట్‌కట్ ప్యాంట్, ఫుల్ షర్ట్‌లో చేతిలో పిస్తోల్ పట్టుకున్న లుక్ ఒకటి ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ అదరగొట్టేశాడు.. విజువల్స్ ఔరా అనిపించేలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు వెంకట్. ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.
కొన్నాళ్ల నుంచి ఎలాంటి షూటింగ్ అప్డేట్స్ రాకపోవడంతో నిరాశలో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానుల్లో తాజా వార్త ఫుల్ జోష్ నింపుతోంది. పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరి ఓజీ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. పవన్ కల్యాన్ మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు చిత్రాల్లో కూడా నటిస్తుండగా.. వాటికి సంబంధించిన అప్డేట్స్ రావాల్సి ఉంది.
ఓజీ స్టైలిష్ రిలీజ్ డేట్ లుక్..
The #OG will arrive on 27th September 2024. #TheyCallHimOG #OGonSept27th pic.twitter.com/4PZTUZe2db
— DVV Entertainment (@DVVMovies) February 6, 2024
Alaantodu malli thirigi vasthunnadante…..#OG Grand release on Sept 27th…🔥🔥🔥🔥#FireStormIsComing#TheyCallHimOG #OGonSept27th @PawanKalyan #Sujeeth #EmraanHashmi @priyankaamohan @MusicThaman @dop007 @NavinNooli @DVVMovies pic.twitter.com/P8kNuOkMB5
— BA Raju’s Team (@baraju_SuperHit) February 6, 2024
Powerstar #PawanKalyan’s Highly Anticipated #OG to have a Grand Release Worldwide on September 27th!#PowerStarPawanKalyan
#TheyCallHimOG #Sujeeth @IamKalyanDasari @DVVMovies pic.twitter.com/ZugOArGhGi— BA Raju’s Team (@baraju_SuperHit) January 30, 2024
We have a chance of making #PawanKalyan Garu sing in #TheyCallHimOG 🎙️💥, #OG has so much of dose – @MusicThaman Anna at Super Singer Telugu 😍❤️
Let’s hope for the best 🧨 #Thaman pic.twitter.com/eD5CYGnbeu
— ThamanFandomGroup™ (@Supremo_TFG) January 16, 2024
OG Happy Newyear #PawanKalyan అన్న బ్లాక్ బస్టర్ 2024 లోడింగ్ 💥💪
:- #Venkat#TheyCallHimOG @DVVMovies pic.twitter.com/ytx7c4m4Sf— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) January 1, 2024
ఓజీ గ్లింప్స్..
ఓజీ షూట్ లొకేషన్లో వెంకట్ ఇలా..
Hero #Venkat Doing Important role in @PawanKalyan‘s #TheyCallHimOG 🔥 pic.twitter.com/pa44ZqfI9X
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) October 29, 2023