OG Movie | అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఒపెన్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. బుకింగ్ వెబ్‌సైట్స్ బుక్ మై షో(Book My Show)తో పాటు డిస్ట్రిక్ట్ (District) యాప్‌లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
#OG BOOKINGS OPEN NOW 🤙🏻#TheyCallHimOG@PawanKalyan @emraanhashmi @SujeethSign @Iam_Arjundas @priyankaamohan @MusicThaman pic.twitter.com/iGMYbti7fe
— Telugu Film Producers Council (@tfpcin) September 23, 2025