Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజాసేవ, పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారనే దాని గురించి టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ సినిమాలకు దూరమవుతారని చాలామంది భావించారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజాసేవ, పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారనే దాని గురించి టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ సినిమాలకు దూరమవుతారని చాలామంది భావించారు. అయితే తన అభిమానుల కోసం మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కెరీర్లో 33వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్ కల్యాణ్, దిల్ రాజు కలయికలో వచ్చిన ‘వకీల్ సాబ్’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవన్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తన రాజకీయ, పాలనా బాధ్యతలకు ఇబ్బంది కలగకుండా పవన్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కాల్షీట్లు కేటాయించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ 33వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు అనిల్ రావిపూడి కాగా, మరొకరు వంశీ పైడిపల్లి. కమర్షియల్ ఎంటర్టైనర్లతో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, కల్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరిలో పవన్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ విషయంలోనూ పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుక్మిణి వసంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలోనూ నటిస్తున్నారు. మరోవైపు ‘ది రాజా సాబ్’తో ప్రేక్షకులను పలకరించనున్న మాళవిక మోహనన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో ఎవరినైనా హీరోయిన్గా ఎంపిక చేశారా? లేదా? అనే విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పవన్ కల్యాణ్ 33వ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. దర్శకుడు, హీరోయిన్, చిత్రీకరణ ప్రారంభ తేదీ, కథాంశం వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

