Pawan Kalyan | సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే కాగా, ఈ రోజుని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా మార్చనున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు మేకర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్స్ అందించే ప్లాన్ చేశారు.. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాగా, ఇది మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఇక సెప్టెంబర్ 25న OG రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా, ఇది ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. ఈ పోస్టర్‌తో మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. మరోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. పవన్ పుట్టిన రోజు నాడు ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో అని రూమర్ వచ్చింది కానీ అందులో నిజం లేదు. తాజా సమాచారం ప్రకారం OG నుంచి ఓ గ్లింప్స్ తో పాటు ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
పవన్ చేస్తున్న సినిమాలే ఆయనకి లాస్ట్ అని అంతా భావిస్తున్నారు. అయితే పవన్ కి సంపాదన కేవలం సినిమాలే కాబట్టి ఇంకా సినిమాలు చేస్తారని టాక్. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా ప్రకటించారు. నిర్మాత పవన్ డేట్స్ ఇస్తే ఆ సినిమా చేస్తాం అని తెలిపారు. దీంతో పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాకి సంబంధించి ఏదైన అప్డేట్ ఇస్తారేమో చూడాలి.