Pawan Kalyan joins the OG Shoot | పవన్‌కళ్యాణ్ లైనప్‌లో కాస్త ఎక్కువ ఎగ్జైట్మెంట్ చేస్తున్న సినిమా ఓజీనే. పవన్ అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు . సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎక్కడలేని బజ్ నెలకుంది. ఒక్క ప్రీ లుక్ పోస్టర్‌కే సోషల్ మీడియా షేక్ అయిందంటే ఏ రేంజ్లో ఈ సినిమాపై అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత వారంఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముంబైలో తొలి ఎపిసోడ్‌ను స్టార్ట్ చేశారు. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు.
ఇదే విషయాన్ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు ఆయన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది.
దీనితో పాటుగా పవన్ హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ్ సిత్తం రీమేక్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటుగా పవన్, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్‌ను కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది.
THE #OG HAS ARRIVED on sets… 🔥🔥🔥#PawanKalyan #TheyCallHimOG #FireStormIsComing@PawanKalyan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#𝙏𝙝𝙚𝙮𝘾𝙖𝙡𝙡𝙃𝙞𝙢𝙊𝙂💥 pic.twitter.com/Qv9K9ito4Q
— DVV Entertainment (@DVVMovies) April 18, 2023