టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పీడు పెంచేశాడు. పొలిటికల్ కమిట్ మెంట్స్ కు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సినిమాలు పూర్తి చేసేలా ప్లాన్ సెట్ చేశాడు. ప్రస్తుతం స్టార్ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ బల్క్ డేట్స్ కేటాయించాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ 90 రోజులు పనిచేయబోతున్నాడట..అంటే 3 నెలలన్నమాట. పవన్ కల్యాణ్ ఈ గ్యాప్‌లోనే సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేశాడా..? అన్నది తెలియాల్సి ఉంది. తమ అభిమాన హీరో వేగంగా సినిమా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడన్న వార్తను మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో స్పెషల్ సెట్ కూడా వేశారు మేకర్స్. పవన్ కల్యాణ్ ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలో నటిస్తోన్న వినోదయ సీతమ్ రీమేక్ షూటింగ్లో ఉన్నాడు పవన్ కల్యాణ్. మరోవైపు ఓజీ (OG) డైరెక్టర్ సుజిత్ కూడా లొకేషన్ల వేటలో పడ్డాడు. ఈ సినిమా కూడా త్వరలోనే షూటింగ్ షురూ కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అభిమానులను ఖుషీ చేస్తున్నాడు పవన్ కల్యాణ్.